'గుడిసెలు కూలిస్తే ఎక్కడుండాలి'

10:25 - January 8, 2017

తూర్పుగోదావరి : తాము ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్న స్థలంలో గుడిసెలను కూలిస్తే ఎక్కడకు పోవాలని పేదలు పేర్కొంటున్నారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలోని పేదల కాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈసారి మాత్రం అధికారులు తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి చేరుకుని వ్యతిరేకించే వారిని ముందుగానే అరెస్టు చేసి జేసీబీలతో గుడిసెలను తొలగించారు. డీఎస్పీతో ఐదుగురు సీఐలు, ఇతర ఎస్ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది సహాయంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను చేపట్టారు. తమకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని, గుడిసెలు కూలిస్తే ఎక్కడకు పోవాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా కూల్చివేతలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Don't Miss