‘ఆర్.ఆర్.ఆర్’ ప్రారంభోత్సవానికి డార్లింగ్ ప్రభాస్...

15:23 - November 5, 2018

హైదరాబాద్ : సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్‌లు ఆస్తకి రేపుతుంటాయి. అంతేకుండా ఉత్కంఠను రేకేత్తిస్తుంటాయి. సినిమా ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొంది. ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంపై అందరీ చూపు ఉంది. 
Image result for rajamouli rrr filmటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆర్.ఆర్.ఆర్’ వర్కింగ్ టైటిల్ పెట్టారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 11గంటలకు సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇటీవలే రాజమౌళి ప్రకటించారు. కానీ ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎవరొస్తారనే దానిపై చర్చ జరిగింది. 
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్‌తో రాజమౌళి కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అంతర్జాతీయస్థాయిలోకి ఎక్కాయి. కేవలం ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ ఇతర సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు బాక్సర్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. 1920 నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని టాక్. కానీ ఈ యంగ్ హీరోల సరసన ఏ హీరోయిన్స్‌లు నటించనున్నారనేది తెలియరావడం లేదు. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. మరి ప్రారంభోత్సవానికి ఎవరొస్తారనేది 11న తేలనుంది. 

Don't Miss