'ప్రభుదేవా' దర్శకత్వంలో 'ప్రభాస్'...

11:21 - July 3, 2017

ప్రభాస్...‘బాహుబలి'..’బాహుబలి-2’..చిత్రాల ద్వారా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరొందిన నటుడు. ప్రస్తుతం ఇతడి కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో నటింప చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్..ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరొందిన 'ప్రభుదేవా' దర్శకత్వంలో 'ప్రభాస్' నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'ప్రభుదేవా' దర్శకత్వంలో పలు చిత్రాలను వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో 'ప్రభాస్‌' అతిథి పాత్రలో చేస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై 'ప్రభుదేవా' మీడియాతో మాట్లాడారు..కేవలం బిజినెస్‌ కోసం తామిద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థం లేదని, ‘ప్రభాస్‌'తో సినిమా తీయాలనుందని స్పష్టం చేశారు. 'సాహో' సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తామన్నారు.

Don't Miss