రాష్ట్రపతి ఎన్నిక..ఏకగ్రీవానికి బీజేపీ ప్రయత్నాలు..

15:38 - June 19, 2017

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. కాసపేటి క్రితం రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో వెల్లడించారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే మిత్రపక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం రామ్ నాథ్ పేరును ఖరారు చేయడం జరిగిందని షా పేర్కొన్నారు. బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత వ్యక్తి అని, రామ్ నాథ్ పేరును ఖరారు చేసిన విషయం విపక్షాలకు ఫోన్ లో తెలియచేయడం జరిగిందన్నారు.

మోడీ ఫోన్ లు..
ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు..తటస్థంగా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో మోడీ మాట్లాడారు. మరోవైపు సోనియా, మన్మోహన్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్లు ఎన్డీయే పక్ష..ఇతర పక్షాల నేతలకు ప్రధాని తెలిపారు. మమతా బెనర్జీతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..అద్వానీ..మురళీ మనోహర్ జోషి..వామపక్ష నేతలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు మాట్లాడారు. ఆయా పార్టీలు చర్చించి తమకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

1945లో జననం..
రాంనాథ్ 1945 అక్టోబర్ 1న ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దళిత నేత. యూపీ నుండి 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా..బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులో రాంనాథ్ న్యాయవాదిగా పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం రాంనాథ్ కోవింద్ 23 నామినేషన్ వేయనున్నారు.

Don't Miss