దేశ ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టేసిన ప్రధాని ప్రకటన..

13:56 - November 8, 2018

ఢిల్లీ: నోట్ల రద్దుకు ఈరోజుకు అంటే నవంబర్ 2019నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. నోట్ల రద్దు విషయంపై 2016 నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనతో దేశం యావత్తు షాక్ కు గురయ్యింది. పెద్దల నుండి సాధారణ ప్రజానీకం వరకూ నివ్వెరపోయారు. దీంతో తెల్లారేసరికి దేశంయామత్తు భయాందోళనలకు గురయ్యింది. నల్లధనాన్నిన వెలికి తీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్రం సమర్థించుకుంది. దేశ ప్రజలను అర్థరాత్రికి రాత్రి నడిరోడ్డుపై నిలబెట్టేసింది. నల్లధనం మాట ఎలా వున్నా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అయిపోయింది.

Image result for demonetisation peaple proublumsచిరు వ్యాపారుస్థుల నుండి పెద్ద వ్యాపారుల వరకూ ఏం చేయాలో పాలుపోక అతలాకుతలం అయిపోయారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు రెండేళ్లు నిండిన  సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అసలు ఉద్దేశాన్ని విశదీకరించారు. డీమానిటైజేషన్ అదే పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నగదును సీజ్ చేయటం కాదు.. ఎక్కువ నగదు కలిగిఉన్న వారిచేత పన్ను చెల్లించేవిధంగా చేయడమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. ‘‘లెక్కలోలేని నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు.. వారిచేత పన్ను చెల్లింపచేయడమే ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచే విధానం అవసరం దేశానికి ఉంది’’ అంటూ బుధవారం జైట్లీ వివరించారు. కానీ ఇది ఎంతవరకూ వాస్తమో? ఇది ఎంతవరకూ నెరవేరిందో కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రశ్నార్థకంగా మారటం గమనించాల్సిన విషయం. 

 

 

Don't Miss