ప్రధాని తెలుగు ట్వీట్ : ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..

09:35 - December 7, 2018
ఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై స్పందించే ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలపై ట్వీట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకున్న ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు.డిసెంబర్ 7వ తేదీ తెలంగాణతోపాటు రాజస్థాన్‌లోనూ పోలింగ్ నిర్వహణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సందేశమిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. 
తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాననీ.. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

 

Don't Miss