ఫీజు కట్టలేదని విద్యార్థినులను బాత్‌రూం వద్ద కూర్చోబెట్టారు....

17:04 - September 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆకివీడులో దారుణం జరిగింది. రవీంద్రభారతి స్కూల్‌లో ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు స్కూల్‌ ఫీజు కట్టలేదన్న కారణంతో బాత్‌రూం వద్ద కూర్చోబెట్టాడు టీచర్‌. విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. స్కూల్‌ యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో స్కూల్‌ ముందు పేరెంట్స్‌ ఆందోళనకు దిగారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఎంఈవో రవీంద్ర ఘటనపై విచారణ చేపట్టారు. 

 

Don't Miss