శ్రీనువైట్లకు నిర్మాతలు కండీషన్స్ పెట్టారంట...

11:54 - January 10, 2017

కెరీర్ పరంగా సంప్ల్ లో ఉన్న శ్రీనువైట్ల రెమ్యూనరేషన్ విషయంలో న్యూ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఈ దర్శకుడిపై ఇండస్ట్రీలో కొత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల ప్రస్తుతం అంత సీన్ లేదని కేవలం ప్రొడ్యూసర్సే ఇలా కండిషన్ పెట్టారని వినిపిస్తోంది. అసలు శ్రీనువైట్ల స్ట్రాటజీ ఏంటీ ఈ దర్శకుడికి నిర్మాతలు పెట్టిన కండీషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కొత్తదనం లేని కథలతో చిరాకు 
రోజు తింటే వేపఆకు కూడా తియ్యగా అనిపిస్తోంది. అలాగే రోజు తిపి తింటే కూడా చేదవుతోందని తెలిసిందే. శ్రీనువైట్ల సినిమాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతోంది. రెడీ దూకుడు లాంటి సినిమాలు సక్సెస్ అయ్యే సరికి, ఈ దర్శకుడు వరుసగా ఇలాంటి మూవీసే చేశాడు. ఏ మాత్రం కొత్తదనం లేని కథలతో ఆడియన్స్ కి చిరాకు తెప్పించాడు. చివరికి బ్రూస్ లీ తో అయిన తన పంథా మారుస్తాడేమో అనుకుంటే పరమరోటీన్ మూవీ తీసి మరో డిజాస్టర్ ని చవిచూశాడు. దీంతో ఆయన సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేందంటే శ్రీనువైట్ల కెరీర్ ఎలాంటి ఊహించలేని స్థితికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.
కొత్తదనం ఆశిస్తున్న ఆడియన్స్ 
శ్రీనువైట్ల తీసిన కింగ్ సినిమాలో బ్రహ్మనందం నాగార్జునతో మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారని అర్ధం అవుతోందని ఓ డైలాగ్ చెప్పుతాడు. సేమ్ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఈ దర్శకుడి నుంచి కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. ఇది గమనించిన శ్రీనువైట్ల కూడా మిస్టర్ తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ కూడా చాలా ప్రెష్ గా ఉంది. లావణ్య త్రిపాఠీ,హెబ్బాపటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ మూవీనే శ్రీనువైట్ల కెరీర్ ఎలా ఉండబోతోందో నిర్ణయించబోతోంది. 
మిస్టర్ సక్సెస్ బట్టి రెమ్యూనరేషన్  
శ్రీనువైట్ల, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ మూవీకి సన్నాహాలు జరుగున్నాయి. దర్శకుడు శ్రీనువైట్ల మిస్టర్ సినిమా సక్సెస్ బట్టి చైతూ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోవాలని భావిస్తున్నాడట. కానీ ఇది శ్రీనువైట్ల తీసుకున్న నిర్ణయం కాదని ప్రొడ్యూసరే, దర్శకుడితో ఈ కండిషన్ పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చైతూ మూవీ కోసం శ్రీనువైట్ల భారీ రెమ్యూనరేషన్ అడిగాడట. కానీ ఈ దర్శకుడు ప్రస్తుతం ప్లాప్స్ లో ఉండడంతో అంత భారీ అమౌంట్ ఇవ్వడం కుదరదని సదరు నిర్మాత చెప్పాడట. దీంతో మిస్టర్ సక్సెస్ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తానని ఆ ప్రొడ్యూసర్ చెప్పాడట. అన్నట్లు నాగార్జునతో పలు సక్సెస్ పుల్ చిత్రాలు నిర్మించిన శివప్రసాద్ రెడ్డి ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

 

Don't Miss