పరవళ్లు తొక్కుతున్న కృష్ణామ్మ

09:40 - October 12, 2017

 

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిస్తాయిలో నిండటం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 884.40 అడుగులతో 212 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మూడున్నర టీఎంసీలు మాత్రమే తక్కువ ఉంది. మరోవైపు జూరాల, సుంకేశుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అటు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 88,559 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. శ్రీశైలంగేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో మరికొద్దిరోజుల్లో జలకళ రానుంది. 

Don't Miss