తండ్రి..ఇద్దరు సోదరులను చంపేసిన అన్న...

14:39 - January 28, 2018

నాగర్ కర్నూలు : ఓ కుటుంబంలో చెలరేగిన భూ వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. కుటుంబంలోని తండ్రి..ఇద్దరు సోదరులను ఓ అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో చోటు చేసుకుంది. భాస్కరయ్య వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు మల్లేష్..తండ్రి సోదరుల మధ్య భూ వివాదం చెలరేగుతోంది. పొలం దగ్గరకు వెళ్లిన చిన్న తమ్ముడితో మల్లేష్ వాదనకు దిగాడు. వెంటనే తెచ్చుకున్న గొడ్డలితో నరికి చంపేశాడు. వెంటనే రెండో తమ్ముడికి దగ్గరకు చేరుకుని అతడిని నరికివేశాడు. తండ్రిని కూడా ఇదే విధంగా హత్య చేసిర పరారయ్యాడు. మల్లేష్ సైకోగా వ్యవహరిస్తుంటాడని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా తల్లిపై మల్లేష్ ఘర్షణకు పాల్పడ్డాడని, దీనితో వీరందరినీ వదిలేసిన ఆ తల్లి పుట్టింట్లో ఉంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

Don't Miss