చలిలోనే శ్రీవారి భక్తులు..

09:38 - January 8, 2017

చిత్తూరు : ముక్కోటి ఏకాదశి పర్వదినం..ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలివస్తుండడంతో తిరుమల కిక్కిరిసిపోతోంది. శనివారానికే లక్ష మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి ఉద్యానవనం వద్దనున్న క్యూ లైన్ లలో భక్తులు కిక్కిరిసిపోయారు. శనివారం మధ్యాహ్నం వీరు క్యూ లైన్ లో ప్రవేశించారు. ఆదివారం ఉదయం 9గంటలవుతున్నా వీరికి శ్రీవారి దర్శనం కలుగలేదు. దీనితో రాత్రి చలిలోనే భక్తులు పడిగాపులు పడ్డారు. తాము చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డామని భక్తులు పేర్కొన్నారు. క్యూ లైన్..ఇతర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టిటిడి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.

Don't Miss