'పూరీ' మెహబూబా ప్రారంభం...

13:47 - October 11, 2017

ఏ వుడ్ లోనైనా తమ తనయులను హీరోలుగా స్థిరపరచాలని హీరోలు..దర్శక..నిర్మాతలు అనుకుంటుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొందరు ఇంకా ప్రయత్నాలు సాగిస్తుంటుంటారు. అలాంటి వారిలో 'పూరి జగన్నాథ్' ఒకరు. తనయుడు 'ఆకాష్ పూరీ'ని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు నిరాశపరుస్తున్నా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. పూరీ - బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ ప్రస్తుతం సినిమా సినిమాకి 'పూరీ' ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే, ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. ఆకాష్ పూరీ హీరోగా పూరీ దర్శకత్వంలో 'వైష్ణో అకాడమీ సంస్థ' ఓ చిత్రం నిర్మిస్తోంది. గతంలో వచ్చిన సినిమాలకంటే ఇది భిన్నంగా ఉంటుందని టాక్. 1971 నాటి ఇండియా - పాక్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని పూరీ పేర్కొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఛార్మీ క్లాప్ కొట్టగా షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. పంజాబ్, రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగనుంది. యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నట్లు పూరీ పేర్కొన్నారు. మంగుళూరు మగువ నేహా శెట్టి నాయికగా పరిచయమవుతోంది. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

Don't Miss