'పూరీ' కొత్త ఫిల్మ్...

11:11 - September 28, 2017

టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో 'పూరీ జగన్నాథ్' ఒకరు. తన చిత్రాల్లో హీరో..హీరోయిన్ల గెటప్..ఇతర విషయాల్లో వెరైటీగా చూపిస్తుంటాడు. తన మార్కును తన చిత్రాల్లో చూపించి ఆయా హీరోలు..హీరోయిన్ల అభిమానాన్ని చూరగొనడంలో 'పూరీ' దిట్ట. గత చిత్రాలు ఆయనకు మంచి విజయాలే అందించాయి కానీ కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఆయన దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'పైసా వసూల్' చిత్రం కూడా మరోసారి నిరాశపరిచింది. ఈ చిత్రంలో 'బాలకృష్ణ' హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే పూరీ తనయుడు 'ఆకాష్' ను హీరోగా లాంచ్ చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. నేడు పూరీ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'మెహబూబా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971 భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సినిమా ఉండనుంది. మంగళూరు మోడల్ 'నేహా శెట్టి' హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సందీప్ చౌతా సంగీతమందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లలో షూటింగ్ జరుపుకోనుంది. అక్టోబ్ నుండి ప్రారంభమయ్యే ఈ సినిమా విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

Don't Miss