'గుడ్ మార్నింగ్‌ పుట్టపర్తి' కార్యక్రమాన్ని చేపట్టిన పల్లె రఘునాథ్‌రెడ్డి

21:29 - February 3, 2018

అనంతపురం : ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి .. గుడ్‌ మార్నింగ్‌ పుట్టపర్తి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు, ఏడు వార్డుల్లో ఆయన పర్యటించి.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు వద్దకు నేరుగా వెళ్లి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు విన్నవించుకున్న సమస్యలను.. వెంటనే పరిష్కరించాలని.. అధికారులను ఆదేశించారు. పల్లె రఘునాథ్‌రెడ్డి వెంట.. స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ చలపతి, వుడా చైర్మన్‌ కడియాల సుధాకర్‌, రాము, కౌన్సిలర్లు ఉన్నారు.

 

Don't Miss