హైదరాబాద్ పై బెంగళూరు విజయం

08:43 - May 18, 2018

హైదరాబాద్ : ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌ కీలక విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాయల్‌ ఛాలెంజర్స్ డివిలియర్స్‌, మొయిన్‌ అలీల మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218  పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలు చివరి వరకు పోరాడినా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు  సనరైజర్స్‌పై  విజయం సాధించింది. సన్‌రైజర్స్‌పై విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరువగా వచ్చింది. అయితే తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూర్ గెలిచినా..  ఇతర జట్ల గెలుపు, ఓటములపై  ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బెంగళూర్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా  బ్యాంటింగ్‌ చేయడంతో పాటు మ్యాచ్‌లో చక్కటి క్యాచ్‌ను అందుకున్న ఏబీ డివిలర్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ లభించింది.  

 

Don't Miss