'వర్మ' ట్వీట్లపై 'టిడిపి'లో చర్చ !

15:15 - February 12, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' ఈసారి టిడిపి ఎంపీలను టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా..ఇతర హామీలు అమలుపరచాలని టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనపై 'వర్మ' వివాదాస్పద ట్వీట్లు చేశారు. టిడిపి ఎంపీలను బ్రోకర్ తో పోల్చారు. వారి వల్ల పరువు పోతోందని ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఇలాంటి ఎంపీలను చూసి ప్రధాన మంత్రి మోడీ జోక్ గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టిడిపి ఎంపీలు బ్రోకర్లకు తక్కువగా అంటూ ట్వీట్ చేసిన వర్మ మరో ట్వీట్ కూడా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన టిడిపి పార్టీ పరువును జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారంటూ వర్మ పేర్కొన్నారు. వర్మ చేసిన ట్వీట్ పై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Don't Miss