పెద్దనోట్ల రద్దు నిర్ణయం... మహా విషాదాన్ని మిగిల్చింది : రాహుల్‌ గాంధీ

16:26 - November 8, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ చర్య దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని ట్వీట్‌ చేశారు.  దేశంలోని లక్షలాది మంది నిజాయితీపరుల జీవితాలను నోట్లరద్దు విషాదంలో ముంచిందని అన్నారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్‌ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. అత్యంత వేగంగా దూసుకు పోతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్లరద్దు అగాథంలోకి నెట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దు చర్యను కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ డేగా పాటిస్తుందని రాహుల్‌ చెప్పారు.

 

Don't Miss