గోరక్షణ, బీఫ్‌ పేరిట మైనారిటీలు, దళితులపై దాడులు : రాహుల్ గాంధీ

21:56 - September 12, 2017

వాషింగ్టన్ : అమెరికాలో రెండు వారాల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోది ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత్‌లో ప్రస్తుతం అసహన పరిస్థితులు నెలకొన్నాయని... గోరక్షణ, బీఫ్‌ పేరిట మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. మోది ప్రభుత్వం తీసుకున్న  పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయం వల్ల భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతోందని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. మాది సంస్థాగత పార్టీ...దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తాను వారసత్వంగా రాజకీయాల్లో వచ్చానని అనుకోవద్దన్నారు. అఖిలేష్‌ యాదవ్‌, స్టాలిన్‌ కూడా వారసత్వంగా వచ్చినవారేనని రాహుల్‌ గుర్తు చేశారు. 

 

Don't Miss