లండన్‌ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చిన రాహుల్

13:44 - January 10, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లండన్‌ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ఆయన సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు. రాహుల్‌ గాంధీ ఇంట్లో జరిగే సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గోనున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తుపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. యూపి సిఎం అఖిలేష్‌, రాహుల్‌  కూడా ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. సెలవులపై కొన్ని రోజులు లండన్‌ వెళ్తున్నట్లు రాహుల్‌ గాంధీ డిసెంబర్‌ 31న ట్వీట్‌ చేశారు.

 

Don't Miss