ఒక్క వర్షంతో ఏపీ అసెంబ్లీ చిత్తడి..

20:09 - March 17, 2017

విజయవాడ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం.. ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం పడడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. గాలుల దెబ్బకు పోలీసుల టెంట్లు ఎగిరిపోయాయి. అమరావతిలో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రారంభోత్సవంలో ఉన్నంతా హడావిడి.. సదుపాయాలు కల్పించడంలో కన్పించడంలేదు. దీంతో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే కురిసిన వర్షానికి నేతలు, అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు.

అసెంబ్లీ..చిత్తడి..
భారీ వర్షం కురవడం అసెంబ్లీ చుట్టుపక్కల అంతా వ్యవసాయభూమి కావడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. పోలీసుల కోసం ఏర్పాటుచేసిన టెంట్లు గాలికి ఎగిరిపోవడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం దెబ్బకు ప్రాంగణమంతా చిత్తడిగా మారడంతో వావానాలన్ని నేలలో కూరుకుపోయాయి. వాహనాలను చిత్తడి నేల నుంచి బయటకు తీసుకురావాడానికి అటు నేతలు, ఇటు అధికారులు నరకయాతన పడ్డారు. మొదటి నుంచి అందరు చెబుతున్నట్లు వర్షం పడితే అసెంబ్లీ, సచివాలయ పరిసరాలు ఎంత దుర్భరంగా ఉంటాయో రుజువైంది.

Don't Miss