వానాకాలం..ఆరోగ్య జాగ్రత్తలు..

16:00 - June 29, 2017

వానాకాలం వచ్చేసింది. వానాకాలంతో పాటు అంటురోగాలు కూడా వచ్చేస్తుంటాయి. వైరల్ ఫీవర్..ఎలర్జీలు ఈ కాలంలోనే అధికంగా వస్తుంటాయి. మరి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం మేలు. అల్లం..లెమన్..హెర్బల్ టీలను తాగడం మంచిది. ఆకుకూరలు..ఎలాంటి కూరగాయాలైనా శుభ్రంగా కడుక్కొని వాడడం బాగుంటుంది. ఉప్పు నీళ్లతో కూరగాయాలను కడగడం శ్రేయస్కరం. పండ్లు, జ్యూసులు తాగేటప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం. ఉడికించిన కూరగాయాలు..తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. త్వరగా జీర్ణమయ్యే సూపులు..ఇతరత్రా ఆహార పదార్థాలను భుజించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమలు, ఈగల నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేపాకు, కర్పూరం, లవంగాలను ఇంటి మూలల్లో ఉంచడం వల్ల ఈ సమస్య నుండి దూరం కావచ్చు. అనారోగ్యాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనలు..జాగ్రత్తలు పాటించాలి.  

Don't Miss