'రాజు గాడు' అలరిస్తాడంట...

09:51 - October 9, 2017

రాజ్ తరుణ్...'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమాల్లోకి రాకముందు ఇతను లఘు చిత్రాలకు పనిచేశాడు. ఉయ్యాల జంపాల..కుమారి 21 ఎఫ్..సినిమా చూపిస్తా మావ..తదితర చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వెరైటీ యాసతో పలికే డైలాగ్స్..అభిమానులను అలరిస్తుంటాయి. ఇతను తాజాగా 'రాజు గాడు' సినిమా చిత్రంలో నటిస్తున్నారు. ఎ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై 'ఈడోరకం-ఆడో రకం'..'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'..'అంధగాడు'... చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే నిర్మాణ సంస్థలో 'రాజు గాడు' చిత్రం వస్తోంది. ఇందులో 'రాజ్ తరుణ్' సరసన 'అమైరా దస్తుర్' హీరోయిన్ గా నటిస్తోంది.

కామెడీ..లవ్..యాక్షన్ అంశాలతో చిత్రం ఉంటుందని..ఇందులో 'రాజ్ తరుణ్' ను కొత్త పాత్రలో చూస్తారని నిర్మాతలు పేర్కొంటున్నారు. ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. గత చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విధంగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో 'రాజ్ తరుణ్' కు తనకు తెలియకుండానే దొంగతనం చేసే జబ్బు ఉంటుందంట. దాంతో అతగాడు తరచు చేతి వాటం ప్రదర్శిస్తుంటాడు. మరి ఇలాంటి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఏం జరిగిందన్నది సినిమా చూస్తే గాని తెలియదంట. 

Don't Miss