రాజమౌళి ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్పుతున్నాడు.. ఎందుకు.?

13:08 - January 11, 2017

దర్శకధీరుడు రాజమౌళి థ్యాంక్స్ వెరీ మచ్ ప్రభాస్ అంటున్నాడు. అంతేకాదు నీ నమ్మకానికి హ్యట్సాఫ్ డార్లింగ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నీ విలువైన సమయానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని జక్కన్న ట్వీట్ చేశాడు. ఇంతకీ రాజమౌళి ప్రభాస్ కి ఎందుకు థ్యాంక్స్ చెప్పుతున్నాడో...ఇప్పుడు చూద్దాం...
రాజమౌళి కలలకు అండగా ప్రభాస్   
ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది ఫీపుల్ సక్సెస్ ని క్యాష్ చేసకోవాలని చూస్తారు. ఓ భారీ సక్సెస్ వచ్చిన దర్శకుడు లేదా హీరో వెంట వెంటనే సినిమాలను లైన్ పెట్టి ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు అందినకాడికి వెనకేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రభాస్ అలా ఆలోచించలేదు. రాజమౌళి కలలకు అండగా నిలిచాడు. జక్కన్న పెట్టిన కఠోర శ్రమను సంతోషంగా అనుభవించాడు.ఇంతటి సహకారం అందించాడు కనుకే రాజమౌళి, ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్పుతున్నాడు. హీరోగా, దర్శకుడిపై ఉంచిన నమ్మకానికి హ్యట్సాఫ్ అంటూ ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
ప్రభాస్ మిర్చి సినిమాతో బిగేస్ట్ హిట్టు 
రెబల్ సినిమాతో డీలా పడిన ప్రభాస్ మిర్చి సినిమాతో కెరీర్ పరంగా బిగేస్ట్ హిట్టు అందుకున్నాడు. ఇలాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ వెంట వెంటనే మరో రెండు సినిమాలు చేస్తాడని అంతా ఊహించారు. కానీ ఈ అరడుగుల అందగాడు మాత్రం ప్రతిష్టాత్మకంగా రాజమౌళి మొదలెట్టిన మహాయజ్ఞం బాహుబలి కోసం ఏకంగా మూడున్నరేళ్ల పాటు బల్క డేట్స్ ఇచ్చాడు. అయితే ప్రభాస్ త్యాగం చేసిన మూడేళ్ల సమయానికి రాజమౌళి అంతకు మించిన పేరు ప్రఖ్యాతలనే బాహుబలి రూపంలో ప్రభాస్ కి బాహుమతిగా ఇచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం ఇంకా చెప్పాలంటే యావత్తు దేశసిని పరిశ్రమ ఎప్పటికి గుర్తించుకునేలా బాహుబలిని అపురూపచిత్రరాజంగా నిలబెట్టాడు.
ఏప్రిల్ 28న బాహుబలి 2.. రిలీజ్ 
బాహుబలి సెకెండ్ పార్ట్ కోసం సిని ప్రియులే కాదు అన్ని వర్గాలవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్నాళ్లకు జక్కన్న ఈ మూవీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పాడు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి ట్వీటర్ లో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బహుబలి కోసం ఏ హీరో చేయని సాహసం ప్రభాస్‌ చేశాడు. మూడున్నర ఏళ్లు సినిమా కోసమే వెచ్చించడని, ఇందుకు నీకు హ్యట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు.ఈ మూడున్నరేళ్ల ఈ ప్రయాణం ఓ నరకం వంటిదని.ఈ  సినిమాపై నీకున్నంత నమ్మకం మరెవరికీ లేదని ప్రభాస్ పై పొగడ్తల జల్లు కురిపించాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సెకెండ్ పార్ట్ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా కంప్లీట్‌ చేసి ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని రాజమౌళి క్లారిటి ఇచ్చాడు.

Don't Miss