ఏడుగురిది హత్యా ?..ఆత్మహత్యా ?

09:36 - December 22, 2017

నల్గొండ : రాజాపేటలో ఓ ఇంట్లో ఏడుగురు మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. వారు తిన్న ఆహారంలో విషం కలిసిందని తెలుస్తోంది. కానీ వారే ఆహారంలో విషం కలుపుకుని తిన్నారా ? అనేక అనుమానాలు కలుగుతున్నాయి. డాగ్ స్వ్కాడ్ టీం ఘటనాస్థలికి రానుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బోన్ డీసీపీతో టెన్ టివి మాట్లాడింది. నాగ భూషణంకు చెందిన కోళ్ల ఫారమ్ లో కూలి పని కోసం కుటుంబం వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం యజమాని వచ్చి చూసేసరికి వారి మృతదేహాలు కనిపించాయని తెలిపారు. మటన్..ఫ్రైడ్ రైస్..మద్యం బాటిల్ ఘటనా స్థలంలో ఉందని తెలిపారు. విచారణలో విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. వారికి ఎలాంటి అప్పులు..గొడవలు లేవని కుటుంబసభ్యురాలు పేర్కొంటున్నారు.

సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8)లు రాజపేటకు ఇటీవలే వచ్చారు. నాగ భూషణంకు చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తూ అక్కడే ఉన్న నివాసంలో ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Don't Miss