అక్క శివాని బాటలో శివాత్మిక..

12:48 - August 17, 2018

జీవితా రాజశేఖర్. వీరిద్దరిని విడి విడిగా చూడలేం. సినిమా పరిశ్రమలో ఏ జంటకు లేని ప్రత్యేకత వీరిద్దరికి వుంది. హీరోగా రాజశేఖర్, నటిగా..దర్శకురాలిగా పలు విభిన్న పాత్రల్లో జీవిత రాజశేఖర్ కు అన్నీ తానై అండగా వుంటుంది. సినిమా పరిశ్రమే మా జీవితం అంటున్న ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు..ఇప్పటికే పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా వుంది. ఈ క్రమంలో అక్క బాటలోనే రెండో కుమార్తె శివాత్మిక కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శివాత్మిక కూడా వచ్చేస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం.

అడవి శేష్ జోడీగా శివాని ..
తెలుగులో అడవి శేష్ జోడీగా శివాని ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇక తమిళంలోను శివాని కథానాయికగా పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

Don't Miss