కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ...ఎన్ డిఎ అభ్యర్థికి టీఆర్ ఎస్ ఓటు

12:48 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్ డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఓటింగ్ లో మొత్తం 222 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎన్ డీఏ అభ్యర్థి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ కు అనుకూలంగా 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ కు అనుకూలంగా 105 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ సభ్యులు ఓటు వేయగా....ఎన్ డిఎ అభ్యర్థికి టీఆర్ ఎస్ సభ్యులు ఓటు వేశారు. వైసీపీ, ఆమ్ ఆద్మీపార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రాజ్యసభ సభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. తీర్మానాల ద్వారా ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. 
 

Don't Miss