జర్నలిస్ట్ @'పెద్దలసభ'డిప్యూటీ చైర్మన్ గా 'హరివంశ్'..

16:28 - August 9, 2018

ఢిల్లీ : కొంతమంది ఎంతటి ప్రతిభ వున్నా వారు వెలుగులోకి రావటానికి ఈ ప్రపంచానికి పూర్తిస్థాయిలో పరిచయం కావటానికి ఓ కీలక సందర్భం తోడ్పడుతుంది. వారు ఆ స్థాయికి రావటానికి మహానుభావుల ప్రభావం కూడా వుండవచ్చు. పెద్ద మనస్సున్నవారి వద్ద పనిచేసినంత మాత్రాన పెద్ద మనసు వస్తుందన్న నమ్మకం లేదు. మేధావుల వద్ద పనిచేసినంత మాత్రాన వారికి మేధావుల సరసన చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ప్రతిభ వున్నవారి ఎదుగుదలను మాత్రం ఎవరు నియంత్రించలేరు. అటువంటివారికి ఓ సమయం..ఓ సందర్భం..అ అవకాశం..ఓ కీలక పరిణామం వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓ కీలక సందర్భం వారికి కీలక పదవి వరిస్తుంది. అటువంటి సమయం, సందర్భం, అవకాశం తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో భారతదేశానికి పరిచయం అయ్యారు.

జర్నలిజం నుండి డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్
రాజకీయ సలహాదారుడిగా..బ్యాంకు ఉద్యోగిగా..జర్నలిస్టుగా వివిధ బాధ్యతలను నిర్వహించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ యుపిలో బలియా జిల్లా డయారా అనే గ్రామంలో జన్మించిన ఈయన బెనారస్‌ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత హరివంశ్‌ హిందీ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైద్రాబాద్‌ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్‌..భారతదేశపు 11వ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడుగా ఉన్న ఈయన 2014 లో మొదటిసారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

మాజీ ప్రధానికి మీఇయా సలహాదారుడిగా హరివంశ్
చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించిన క్రమంలో ప్రభౄత్ ఖబర్ ఎడిటర్ పోస్టుని కాదనుకున్నారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో హరివంశ్ కూడా పదవిని కోల్పోయారు. దీంతో ఆయన తిరిగి జర్నలిజంలో చేరిపోయారు. 1980లో 'ధర్మయుగ్' అనే హిందీ వారపత్రికలో జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించిన హరివంశ్ తరువాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా మరో బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. కానీ కుటుంబ సభ్యులు జర్నలిజంలోనే కొనసాగితే బాగుంటదనటంతో తిరిగి 'రణవీర్' అనే పత్రికలో చేరారు.
జర్నలిస్ట్ నుండి ఎడిటర్ గా ఎదిగిన హరివంశ్
ఒక సాధారణ జర్నలిస్టుగా 1989లో రాంచీలోని ప్రభాత్ ఖబర్ లో చేరిన హరివంవ్ అన పత్రికకు చీఫ్ఎడిటర్ స్థాయికి ఎదిగారు. 2014లో జేడీయూ తరపున రాజ్యసభ ఎంపీ కాగానే ఎడిటర్ పదవికి రిజైన్ చేసి ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రిగా వున్న నితీశ్ కుమార్ కు తన పత్రిక ద్వారా మద్దతు పలికారన్న విమర్శలు హరివంశ్ పై వున్నాయి. కాగా దీంతోనే హరివంశ్ ను రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ నామినేట్ చేసి వుండవచ్చు అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా తనకు అనుకూలంగా మలచుకున్న మేధావిగా హరివంశ్ ను చూడవచ్చు. మంచి మనులు చేసినప్పుడు ఎక్కడ పనిచేసినా మెచ్చుకోవాల్సిందేనంటారు హరివంశ్. వ్యవస్థను టార్గెట్ చేస్తునే నిర్మాణాత్మక విమర్శలతో జర్నలిజం వుండాలని ఆయన అభిప్రాయపడుతుంటారు. ఏది ఏమైనా ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అసాధారణ పెను మార్పులు సంభవించాయి అంటే ఆ వ్యక్తి వెనుక ఒక పెద్ద నేతగానీ..వ్యక్తి గానీ..వ్యవస్థ గానీ వుంటుందనే మాటకు నిదర్శనం ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక రాజ్యాంగ సభకు ప్రతినిథిగా వుండటమంటే పార్టీలకు.. వ్యక్తులకు, పదవులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయటమేనని హరివంశ్ నారాయణ సింగ్ తన బాధ్యతను నిర్వహిస్తారని ఆశిద్దాం..

Don't Miss