రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య

15:09 - August 11, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు తొలిసారిగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. 1998లో తాను రాజ్యసభ సభ్యుడినయ్యానని...కానీ సభా బాధ్యతలు స్వీకరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని వెంకయ్య అన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అత్యున్నత పదవిని అధిష్టించడం ప్రజాస్వామ్యం గొప్పదనమని ఆయన తెలిపారు. తాను రైతుగా చెప్పుకోవడానికి గర్విస్తానని చెప్పారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని...ఆమె ముఖాన్ని కూడా నేనెరగనని వెంకయ్య గద్గద స్వరంతో తెలిపారు. తనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్టీలకతీతంగా సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

Don't Miss