మల్టీస్టారర్‌ చిత్రాల్లో రకుల్...

16:16 - January 11, 2018

'స్పైడర్‌' సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం పలు ఇతర భాషా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్‌ తాజాగా తెలుగులోనూ ఓ రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టులు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు కావడం విశేషం. వీటిలో మొదటగా నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నాని సరసన కథానాయిక పాత్ర కోసం రకుల్‌ని చిత్రబృందం అప్రోచ్‌ అయ్యిందట. అందుకు ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే యువ కథానాయకులు నితిన్‌, శర్వానంద్‌ హీరోలుగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు 'దాగుడుమూతలు' పేరుతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవిని ఎంపిక చేశారట. ఇటీవల ప్రారంభమైన సూర్య సినిమాలోనూ రకుల్‌, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు రకుల్‌ ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌, తమిళంలో కార్తీ సరసన నటిస్తోంది.

 

Don't Miss