రామ్‌చరణ్‌ వీరాభిమాని పరశురామ్‌ మృతి

11:22 - July 15, 2017

హైదరాబాద్: నటుడు రామ్‌చరణ్‌ వీరాభిమాని బుడతడు పరశురామ్‌ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. చూడటానికి చిన్నోడే..కాని నోరు తెరిస్తే సినిమాల్లోని పెద్దపెద్ద డైలాగులను కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు. డ్యాన్స్‌ను సైతం అదరగొట్టేస్తాడు. హావభావాలు పలికించటంలోను దిట్ట. ఆ బుడతడికి రామ్‌చరణ్‌ అంటే వీరాభిమానం, ఆయన డైలాగులను అదరగొట్టగల దిట్ట ఈ బుడ్డొడు. ఇది తెలిసి రామ్‌చరణ్‌ 15 మార్చి 2015న తన ఇంటికి బుడతన్ని పిలిపించుకుని అభినందించారు. అంతేకాకుండా అయిజకు చెందిన పరుశురాముడును అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేలా చెర్రీ ఏర్పాట్లు చేయించాడు. కూలీ డబ్బులతో జీవనం సాగించే కుటుంబ సభ్యులు చిన్నారికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించలేకపోవటంతో బుధవారం కన్నుమూశాడు.

Don't Miss