మణిరత్నం..రామ్ చరణ్ సినిమాకు బ్రేక్ ?

11:40 - April 19, 2017

ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం'..టాలీవుడ్ హీరో 'రామ్ చరణ్' కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాపై తెగ వార్తలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్' నటించిన 'ధృవ' హిట్ సినిమా అనంతరం సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్ మీద ఉండగానే మణిరత్నం చిత్రంలో 'చెర్రీ' నటిస్తున్నారని, ఇటీవలే స్ర్కిప్ట్ కు కూడా ఒకే చెప్పినట్లు టాక్. కానీ ఇటీవలే 'మణిరత్నం' దర్శకత్వం వహించిన 'చెలియా' సినిమా విడుదలైంది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో 'రామ్ చరణ్' పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మణిరత్నం కూడా మనసు మార్చుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్..మణిరత్నం సినిమాకు బ్రేక్ పడినట్లేనా ? కాదా ? అనేది తరువాతి రోజుల్లో తెలియనుంది.

Don't Miss