'దర్శకుడు' ఆడియో వేడుకకు చెర్రీ..

10:59 - July 14, 2017

దర్శకులు నిర్మాతలవుతారు..నిర్మాతలు దర్శకులవుతారు...హీరోలు..హీరోయిన్లు కూడా దర్శకులు..నిర్మాతలుగా మారుతుండడం చూస్తూనే ఉంటాం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మాణ సారథ్యంలో 'దర్శకుడు' అనే వెరైటీ ప్రేమ కథను వెండితెరపై చూపించబోతున్నారు. ఈసినిమాలో 'అశోక్', ‘ఈషా' హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జుక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

రిలీజ్ కంటే ముందుగా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందులో భాగంగా ఈనెల 15న పాటల విడుదల వేడుక నిర్వహించాలని, ఇందుకు మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్' ముఖ్యఅతిథిగా పిలవాలని చిత్ర బృందం భావించింది. ‘రామ్ చరణ్' స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘చెర్రీ' చేతుల మీదుగా పాటలను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే 'రామ్ చరణ్' తాజా చిత్రం 'రంగస్థలం 1985’ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ సినిమాను సుకుమార్ తనదైన స్టైల్ లో తీస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో 'రామ్ చరణ్' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది.

Don't Miss