మరో వైవిధ్య పాత్రలో 'రానా'...

10:18 - May 17, 2017

టాలీవుడ్ లో నటించిన కొన్ని చిత్రాల్లో అయినా మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో 'రానా' ఒకరు. వైవిధ్యభరితమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. తాజాగా ఆయన నటించిన 'బాహుబలి -2' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో తదుపరి సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. తేజ దర్శకత్వంలో వస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి'లోనూ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా మరో చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'రానా' సీబీఐ అధికారిగా నటించబోతున్నట్లు టాక్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని, ఈ హత్య కేసులో పోలీసు అధికారిగా డా.కార్తికేయన్ ప్రధాన అధికారిగా వ్యవహహరించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్రలో 'రానా' నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Don't Miss