బాలికపై అత్యాచారం..ఆపై యాసిడ్ దాడి

12:31 - January 12, 2017

ప్రకాశం : వలేటివారిపాలెంలో ఘోరం జరిగింది. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. వలేటివారిపాలెంలో అంకమరావు (35) వివాహితుడు.. 14 ఏళ్ల వయసున్న బాలికను కిడ్నాప్ చేశాడు. నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై బాలికపై యాసిడ్ దాడి చేశాడు. అనంతరం నిందితుడు బాలిక పేరు మార్చి శిరీష అనే పేరుతో ఆస్పత్రిలో చేర్పించి, పరార్ అయ్యాడు. బాలిక ఛాతి భాగం నుంచి శరీరం కింది భాగం వరకు పూర్తిగా కాలిపోయింది. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు అంకమరావు కోసం గాలిస్తున్నారు. 

 

Don't Miss