రాశీఖన్నా మూవీ ట్రైలర్ అదుర్స్

13:47 - September 2, 2017

హైదరాబాద్:తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా వున్న అందాల రాశి రాశీఖన్నా తొలిసారి మళయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హ‌ర్షిత చోప్రా అనే పాత్ర‌ను రాశి ఖ‌న్నా పోషిస్తుండ‌గా, తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విలన్ చిత్రంలో మోహన్ లాల్.. మాథ్యూ మనోరంజన్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండ‌గా , ఆయన భార్యగా మంజూ వారియర్ నటిస్తుంది. విలన్ చిత్రాన్ని ఇటు తెలుగు అటు మలయాళంలో దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో శ‌క్తివేల్ ప‌ళ‌నిస్వామి అనే పాత్ర‌ను విశాల్‌, ఫెలిక్స్ డి విన్సెంట్ అనే పాత్ర‌ను శ్రీకాంత్‌, శ్రేయ అనే పాత్ర‌ను హ‌న్సిక చేస్తున్నారు రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై రాక్ లైన్ వెంక‌టేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్ గా పీట‌ర్ హెయిన్, మ‌నోజ్ ప‌ర‌మ‌హంస పని చేస్తున్నారు. చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు.

Don't Miss