అశ్విన్‌ రికార్డుల మోత...

21:56 - December 22, 2016

హైదరాబాద్ : 2016 సీజన్‌లో అశ్విన్‌ సాధించిన రికార్డ్‌లు నమోదు చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌, ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్లలో అశ్విన్‌ రికార్డ్‌ల మోత మోగించాడు.2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌, బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డ్‌లు అశ్విన్‌కే  సొంతమయ్యాయి.    
నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌... 
నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌... నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌... ఆల్‌ ఇన్‌ వన్‌ అశ్విన్‌... ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో స్పిన్‌ సెన్సేషన్‌ అశ్విన్‌...ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. టెస్టుల్లో నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా  ,నెంబర్‌ వన్‌  ఆల్‌రౌండర్‌గా  మోడ్రన్‌ క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్రను తిరగరాస్తున్నాడు.
విభిన్నమైన ఫార్మాట్లలో నిలకడగా రాణించిన అశ్విన్‌ 
2016 సీజన్‌లో అశ్విన్‌ సాధించిన రికార్డ్‌లు నమోదు చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌, ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్లలో అశ్విన్‌ రికార్డ్‌ల మోత మోగించాడు. గత సీజన్‌లో ఈ రెండు విభిన్నమైన ఫార్మాట్లలో నిలకడగా రాణించిన ఏకైక క్రికెటర్‌ అశ్విన్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌, బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డ్‌లు అశ్విన్‌కే సొంతమయ్యాయి. 
అంచనాలకు మించి అదరగొట్టిన అశ్విన్  
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అవార్డ్‌లకు పరిగణించే 2015 సెప్టెంబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ మధ్య కాలంలో  టెస్ట్‌, టీ 20 ఫార్మాట్లలో అశ్విన్ అంచనాలకు మించి అదరగొట్టాడు. ఈ సీజన్‌లో టెస్టుల్లో  అత్యుత్తమంగా 48 వికెట్లు తీయడంతో పాటు, 336 పరుగులు చేసి ....ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ ప్లేయర్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే క్యాలెండర్ ఇయర్‌లో ట్వంటీ ట్వంటీ  ఫార్మాట్‌లోనూ అశ్విన్‌ అదరగొట్టాడు. కేవలం 19 టీ20 మ్యాచ్‌ల్లోనే  27 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో బౌలర్‌గా, టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా  అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్‌ ఐసీసీ బెస్ట్‌ క్రికెటర్‌గా, సర్‌గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ అందుకోనున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్ తర్వాత ఐసీసీ బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డ్‌ నెగ్గిన 3వ భారత క్రికెటర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు.  
లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా కీలక ఇన్నింగ్స్‌ 
2016లోనే టెస్టు ఫార్మాట్‌లోనే 72 వికెట్లు పడగొట్టాడంటే అశ్విన్‌ ఎంతలా చెలరేగాడో తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో 3 సార్లు 5 వికెట్ల ఫీట్ నమోదు చేసిన అశ్విన్‌...ఓవరాల్‌గా 28 వికెట్లు పడగొట్టాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా కీలక ఇన్నింగ్స్‌ ఆడి మూడు హాఫ్‌ సెంచరీలతో 306 పరుగులు నమోదు చేశాడు.
సంచలనాలకు మారుపేరుగా అశ్విన్  
గత రెండేళ్లుగా కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొడుతోన్న అశ్విన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా ఉన్న అశ్విన్‌...ఇదే స్థాయిలో రాణిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు తిరుగుడందనడంలో సందేహమే లేదు.

 

Don't Miss