అప్పుడు లేని ఆత్మగౌవరం వారికి ఇప్పుడే గుర్తుకొచ్చిందా?

10:16 - November 8, 2018

హైదరాబాద్ :  ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ టీడీపీ నేతలు అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా  టీ.టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు.. టీఆర్ఎస్ ది కుటుంబ కూటమి అని మాది ప్రజల కూటమి అని రావుల స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతున్నారనే టీఆర్ఎస్ కు ఎదురు కౌంటర్ ఇచ్చారు రావుల. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు..2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు లేని ఆత్మగౌరవ తాకట్టులు తమ కూటమిని విమర్శించేవారికి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? అంటు రావుల ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ది కుటుంబ కూటమి, మారు ప్రజా కూటమి : రావుల
ఈ సంద్భంగా రావుల టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు.ముఖ్యంగా దేశ రాజకీయాలలో చంద్రబాబు మహాకూటమి దేశ రాజకీయాలలో పెను మార్పులు తీసుకొస్తుందనీ..చంద్రబాబు ఈరోజున బెంగళూరు వెళ్తున్న సందర్భంగా అభినందనలు తెలపటానికి వచ్చామని రావుల తెలిపారు. ఈ క్రమంలో దేశంలో రాజకీయాలు కలుషితం అయిన నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న జాతీయ మహాకూటమికి తెలుగు ప్రజలు ఎక్కడా వున్నాగానీ..చంద్రబాబు ఆశయాలను అమలు చేసేందుకు నిరంతరం కట్టుబడి వుంటామని రావుల తెలిపారు. 

Image result for mahakutamiతెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలోని భాగస్వామిగా వున్న టీడీపీ మహాకూటమిలో టీడీపీకి 14 స్థానాలు కేటాయించే అవకాశం ఉండడంతో.. ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు ఇవాళ టీ-టీడీపీ నేతలు అమరావతి వెళారు. చంద్రబాబు ఆమోదం తర్వాత.. అభ్యర్థుల జాబితా ఫైనల్‌ చేయనున్నారు టీ.టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోదూసుకుపోతున్న క్రమంలో కూటమిలో భాగంగా టీడీపీ  వెనుకబడిపోతారా అనే ప్రశ్నకు సమాధానంగా టీడీపీకి ఎన్నికలు కొత్తకాదనీ..టీడీపీకి ప్రజల్లో వుండే మద్దతుతో ప్రజల అభిమానాన్ని పొందుతామని తెలిపారు. గతంలో నామినేషన్ ప్రక్రియ జరిగిన తరువాత కూడా అభ్యర్ధుల ప్రక్రియ కొనసాగిందని రావుల గుర్తు చేశారు. కాగా టీడీపీ. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకుని తనకు సమాచారమివ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తెలంగాణ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. 

Don't Miss