సిట్ విచారణకు డ్రెస్ కోడ్ ఎందుకు వాడుతున్నారు..?!

15:27 - July 26, 2017

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సిట్ ఎదుట విచారణకు హాజరై సినీ సెలబ్రిటీలందరూ డ్రస్ కోడ్ పాటించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు పూరి జగన్నాథ్. ఆతర్వాత సుబ్బరాజు, మొన్న తరుణ్, నిన్న నవదీప్ వీళ్లంతా వైట్ షర్ట్‌లతోనే విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్న వారంతా డ్రెస్ కోడ్ వాడుతున్నారా..? లేక డ్రగ్స్ కోడ్ వాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన అనుమానం. వాస్తవానికి వైట్ షర్ట్ అంటే శాంతికి చిహ్నం. అదే బ్లాక్ షర్ట్‌లు వేసుకుంటే... నిరసన తెలిపినట్లు అర్థం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే... తమపై వచ్చిన ఆరో్పణలపై... నటులంతా నిరసన వ్యక్తం చేయాలి. అంటే నల్ల చొక్కాలు దరించి విచారణకు హాజరుకావాలి. తాజాగా నవదీప్ కూడా వైట్ షర్ట్ వేసుకుని విచారణకు రావడంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే గుసగుసలు మొదలయ్యాయి.

ఒక్క శ్యాంకే నాయుడు తప్ప...

ఇప్పటి వరకూ విచారణకు హాజరైన ఐదుగురు సినీ ప్రముఖుల్లో ఒక్క శ్యాంకే నాయుడు మాత్రమే వైట్ షర్ట్ ధరించలేదు. అయితే ఆయన ఒక్కడినే అతి తక్కువ సేపు విచారించిన వదిలేశారు. వైట్ షర్ట్‌లు ధరించి విచారణకు హాజరైన మిగిలినవారంతా... సుమారు 12 గంటల నుంచి 13 గంటలు వరకూ సిట్ విచారణ ఎదుర్కొన్నారు. వీరి వద్దనుంచే శాంపిల్స్ సైతం సేకరించారు. అంటే ఈ డ్రగ్స్ కోడ్ లోనే శ్యాంకే నాయుడు లేరా... లేక డ్రగ్స్ కేసుతోనే శ్యాంకే నాయుడుకి సంబంధం లేదా..? డ్రగ్స్ విచారణకు... డ్రెస్ కోడ్‌గా వైట్ షర్ట్‌లతో హాజరుకావడం... యాదృచ్చికంగానే జరిగిందా..? కావాలే జరుగుతుందా..? ఇప్పుడు ఇదే అంశం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా... డ్రగ్స్ విచారణకు నటులంతా ఒక డ్రెస్ కోడ్‌లో రావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.

Don't Miss