బాల్య వివాహాలు పెరగడానికి కారణం ఏమిటి ?

19:45 - July 18, 2018

బాల్య వివాహాలు.. బాల్య వివాహాలు పెరగడానికి కారణం ఏమిటి ? అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
తెలంగాణలో 25 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో 35 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అర్బన్ లో 17 శాతం బాల్య వివాహాలు చేస్తున్నారు. 16 నుంచి 17 ఏళ్ల వయస్సు లోనే గర్భవతులు అవుతున్న వారు 11 శాతం మంది ఉన్నారు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది.
బాల్య వివాహాలు కావడానికి కారణం... 
బాల్య వివాహాలు కావడానికి కారణం..పేదరికం, నిరక్షరాస్యత, అంధ విశ్వాసాలు, మూఢాచారాలు అని చెప్పవచ్చు. 
ఎవరు శిక్షార్హులు...
2006 లో బాల్య వివాహ నిషేధ చట్టం వచ్చింది. దీని ప్రకారం బాల్య వివాహాల్లో మధ్యవర్తి, పురోహితుడు, ఫంక్షన్ హాలు యజమాని, బాల్య వివాహానికి వచ్చిన వ్యక్తులు, అబ్బాయి, అమ్మాయి తండ్రులు నిందితులు అవుతారు. రెండేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. అయితే అమ్మాయి, అబ్బాయి తల్లులకు శిక్షను మినహాయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss