రెడ్‌ మీ నోట్‌4 మొబైల్‌ లో మంటలు

19:08 - August 13, 2017

తూర్పు గోదావరి : మరోసారి రెడ్‌ మీ నోట్‌4 మొబైల్‌ లో మంటలు చెలరేగాయి. నెల క్రితం ఓ వ్యక్తి రిపేరింగ్‌ చేసే సమయంలో మంటలు వచ్చిన ఘటన మరవకముందే.. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. రావులపాలెంకి చెందిన సూర్యకిరణ్‌ అనే యువకుడు 20 రోజుల క్రితం మొబైల్‌ ఖరీదు చేశాడు. బైక్‌ పై వెళ్తుండగా అకస్మాత్తుగా జేబులో ఉన్న మొబైల్‌లో మంటలు చెలరేగాయి. జేబులో నుండి మొబైల్‌ తీసేంతలో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. ఘటనపై బాధితుడు న్యాయపోరాటానికి కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

 

Don't Miss