టాలీవుడ్ లో రీమేక్ సినిమాల ట్రెండ్..

16:35 - June 4, 2018

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుసగా రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. రిస్క్ ఉండదన్న నమ్మకంతోనే స్టార్లు రీమేక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. స్టార్ హీరో నమ్మకాన్ని నిజం చేస్తూ రీమేక్ సినిమాలు మంచి విజయాలను అందిస్తున్నాయి.

కొత్త కథలకు కొత్త ఆలోచనలకు ఎప్పుడు పెద్దపీట వేసే అక్కినేని హీరోలు మంచి కథ దొరికితే రీమేక్ చేయడానికి కూడా ముందే ఉన్నారు. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా రీమేక్ సినిమాతో అలరించాడు.. సక్సెస్ సాధించాడు.

ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలకు టాప్ క్రేజ్ తీసుకువచ్చారు మెగా హీరోలు.. వరుసగా మెగా హీరోలు ముగ్గురు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా చిరు రీ ఎంట్రీ కోసం కూడా రీమేక్ నే ఎంచుకోవటం కాస్త ఆశ్చర్యపరిచిన తరువాత ఆ నిర్ణయం కరెక్టే అని ప్రూవ్ అయ్యింది.

 

Don't Miss