కేసీఆర్ పై రేవంత్ మరోసారి తీవ్ర ఆరోపణలు...

17:21 - February 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి టి.కాంగ్రెస్ నేత రేవంత్ విరుచకపడ్డారు. ఈసారి భూముల కబ్జాలపై ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ బంధువులు కబ్జా చేసిన అసైన్ మెంట్ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నాలు చేస్తోందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ బంధువులు..ఇతరులు ఆక్రమించిన అసైన్ మెంట్ భూముల వివరాలపై నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.

శంషాబాద్ మహేశ్వరం మండలంలో రామేశ్వరరావు..ఆయన బంధువులు అనేక వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. అసైన్ మెంట్ భూములు ఎంత ? రామేశ్వర్ ఆధీనంలో ఉన్న భూముల వివరాలను చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ చట్టాలను చుట్టాల కోసం సవరించి వందల..వేల ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని..దీనిపై సుదీర్ఘ పోరాటం జరుపుతామన్నారు. నిషేధం ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూముల వివరాలను చెప్పాలన్నారు. 

Don't Miss