పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ...

19:35 - May 20, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ధమ్మపేట మండలం మందలపల్లిలో పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సొసైటీ భూముల్లో షెడ్డులు వేశారని.. రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో షెడ్డులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా నిలిచిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాము పేదవారిమని, కావాలనే రాత్రి సమయంలో ఆకస్మికంగా వచ్చి షెడ్డులను తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Don't Miss