రైస్‌ మిల్లులో ప్రమాదం

20:52 - June 9, 2018

పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం.. పూసాల గ్రామంలోని రైస్‌ మిల్లులో ప్రమాదం చోటుచేసుకుంది. మహా లక్ష్మి రైస్ మిల్లులో బాయిలర్ పేలడంతో.. ఒక గోదాం నేలమట్టం అయ్యింది. దీని పక్కనే ఉన్నవరలక్ష్మి రైస్ మిల్లు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఐదు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పేలుడు శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రైస్‌ మిల్లు యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోనందువల్లే... ఈ ప్రమాదం జరింగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

 

Don't Miss