రక్తమోడిన సేలం..8మంది బలి..

10:13 - September 1, 2018

చెన్నై : సేలం సమీపంలోని మామందూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. సేలం నుండి ధర్మపురి కి వస్తున్న ప్రయివేటు బస్ పూర్తిగా రాంగ్ రూట్ లో రావటంతో బెంగళూరు నుండి సేలంకు వస్తున్న మరో బస్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందగా మొత్తం 25మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. గాయపడినవారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదం స్పందించి క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనందించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రమాదానికి గురైన ఈ రెండు బస్సుల్లో దాదాపు 50మంది ప్రయాణీకులున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సేలంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనాస్థలిని కలెక్టర్ రోహిణి పరిశీలించారు.

Don't Miss