కూల్చివేతలు..చిరు వ్యాపారుల ఆవేదన..

12:16 - April 26, 2018

సంగారెడ్డి : జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో రోడ్డు విస్తరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దీనితో గురువారం ఉదయం భారీ బందోబస్తుతో వచ్చిన మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అందులో చిన్న చిన్న దుకాణాలు..ఇతరత్రా వ్యాపారం చేసుకునే దుకాణాలున్నాయి. విషయం తెలుసుకున్న వ్యాపారులు అక్కడకు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. దుకాణాలు నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, ఆధారం లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ బిల్డింగ్ లు మాత్రం కూల్చివేయకుండా తమపై ప్రతాపం చూపుతున్నారని, తమకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Don't Miss