అమ్మానాన్నలతో రోషన్ ఓటు : తొలి ఓటు ఆనందాన్నిచ్చింది

12:01 - December 7, 2018

హైదరాబాద్ : తొలిసారిగా చేసిన ఏ పని అయినా అదొక తీపిగుర్తుగా వుండిపోతుంది. అందులోనే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఆనందంగా వుందటున్నాడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో తొలిసారి హీరోగా తెరగ్రేటం చేసిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఊహన ముద్దుల తనయుడు రోషన్.  'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. దీంతో ఓటర్ల లిస్ట్ లో ఓటు నమోదు చేయించుకున్న రోషన్ జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. ఆపై కెమెరాలకు తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ ఫోజులిచ్చాడు ఈ టీనేజ్ హీరో. మొట్టమొదటిసారి ఓటు వేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని  రోషన్ తెలిపాడు. 
 

Don't Miss