కారు అద్దెకిచ్చినందుకు రూ.32లక్షలు ఫైన్!!..

13:14 - August 10, 2018

కారులో షికారుకు వెళ్లటం హయిగానే వుంటుంది. కానీ కొన్ని కార్లు నడిపేవాళ్లను టెంప్ట్ చేస్తాయి. జోరుగా వెళ్లమని ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే ఆ కార్ల డిజైన్ అలా వుంటుంది. లగ్జరీ కార్ల తయారీ అలా వుంటుంది. ఇక ఆ కార్లకు విశాలమైన రోడ్డు వుంటే మరింతగా దూసుకుపోవాలనిపిస్తుంది. కానీ మనం నడిపే కారు ఎక్కడ తయారైనా..ఆ కార్లు నడిపే రోడ్లు..ఆరోడ్లపై మనం నడిపే కారు ఏ దేశంలో వుంది? అక్కడ వుండే ట్రాఫిక్ నిబంధనలేమిటి? అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. అటువంటి నిబంధనలు తెలుసుకోకుంటే మాత్రం ఇదిగో ఈ కారు ఓనర్ లాగా బుక్ అయిపోతాం. కేవలం కారును అద్దెకిచ్చిన పాపానికి ఆ కారు ఓనర్ కి రూ.32 లక్షలు జరిమానా కట్టమని ప్రభుత్వం నోటీస్ పంపించింది. ఆ నోటీస్ చూసి ఇంకేముంది కారు ఓనర్ లబో దిబోమన్నాడు. మరి అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

కారులో బాణంలా దూసుకుపోయిన యువకుడు..లబోదిబోమన్న ఓనర్
యువకుల చేతిలో బైకే విమానలా దూసుకుపోతుంది. మరి లగ్జరీ కారు స్టీరింగ్ వారి చేతిలో వుంటే..ఇంకేముంది దాన్ని విష్ణుచక్రంలా తిప్పేస్తారు. రయ్ మని దూసుకుపోతుంటారు. మరి వారు కారు నడిపే రోడ్లు నున్నగా..విశాలంగా వుంటే ఇక వారి ఉత్సాహానికి..దూకుడుకి అంతు వుండదు. ఇలా లగ్జరీ కారుతో విశాలమైన రోడ్ మీదికొచ్చిన ఓ బ్రిటన్ యువకుడు..దుబాయ్ పర్యటనకు వచ్చాడు. ఎత్తైన బిల్డింగులు, విశాలమైన రోడ్లు, లగ్జరీ కార్లకు కేరాఫ్ గా వుండే దుబాయ్ ని చూడగానే మైమరచిపోయాడు. లంబోర్గిని హారికేన్ అనే లగ్జరీ కారును రూ.లక్ష ఇచ్చి రెండు రోజులకు అద్దెకు తీసుకున్నాడు. దుబాయ్ లో ఉండే కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ను తెలుసుకోకుండా..పట్టించుకోకుండా ఆ విశాలమైన..నున్నటి రోడ్లపై రివ్వున బాణంలా దూసుకుపోయాడు. ఫలితంగా కారు ఓనర్ లబోదిబోమనే పరిస్థితికి చేరుకున్నాడు. ఇంకేముంది!!..

బ్రిటన్ ఎంబసీకి మొరపెట్టుకున్న కారు ఓనర్..
దుబాయ్ లోని రోడ్ సర్కిల్స్ లో ఏర్పాటుచేసిన స్పీడ్ గన్లు అధిక వేగంతో వెళుతున్న ఈ లంబోర్గిని వాహనాన్ని గుర్తించాయి. నాలుగు గంటల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ కారుకి రూ.32 లక్షల భారీ జరిమానా విధించి ట్రావెల్స్ కి నోటీస్ పంపించారు. అది చూసిన కారు యజమాని లబోదిబోమంటూ..తాను అంత జరిమానాను కట్టలేనంటు దుబాయ్ ఎంబసీకి మొరపెట్టుకున్నాడు. కానీ అతి కఠినంగా వుండే బ్రిటన్ ఎంబసీకి మొరపెట్టుకున్నాడు..కానీ విచారణ తరువాత చూడొచ్చు ముందు జరిమానా కట్టమని దుబాయ్ సర్కార్ ఆదేశించేసరికి ఆ యజమానికి కళ్లు బైర్లు కమ్మాయి. 

Don't Miss