ఎస్‌ఆర్‌ శంకరన్‌ పేరుతో ఐఏఎస్‌ అకాడమీ

21:34 - January 3, 2017

హైదరాబాద్ : ఉన్నత ఆశయాల కోసం నిబద్ధులైన ఐఏస్ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ పేరుతో హైదరాబాద్‌లో కొత్త ఐఏఎస్‌ అకాడమీ పురుడు పోసుకుంది. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజికవేత్త శ్రీమతి సావిత్రీభాయిపూలే 186 జయంతి సందర్భంగా ఈ అకాడమీ ప్రారంభమైంది. ఈ అకాడమీని   విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు కెఆర్‌ వేణుగోపాల్‌, కాకి మాధవరావు ప్రారంభించారు. ఐఏఎస్‌ అవ్వాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదని.. ఆ లక్ష్యాన్ని  సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని  వారు అభ్యర్ధులకు  సూచించారు. ఉత్తమ లక్ష్యాలతో ప్రారంభించిన ఈ అకాడమీకి ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని.. తెలిపారు. శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ నుంచి భవిష్యత్‌లో ఎంతోమంది  సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామన్నారు. ఉత్తమ సాధన, పట్టుదలతో కృషి చేస్తే ఐఏఎస్‌ అవ్వడం కష్టమేమికాదని ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

 

Don't Miss