ఎస్‌బీఐ ఖాతాదారులకు ఆఖరి హెచ్చరికలు...

09:52 - November 30, 2018

ఢిల్లీ : భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఆఖరి హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వాడుతున్న వారు నవంబర్ 30వ తేదీ శుక్రవారం అర్ధరాత్రిలోపు ఫోన్ నెంబర్ జత చేయాలని..లేనిపక్షంలో ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలను నిలపివేస్తామని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 'రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల ప్రకారం ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే తప్పనిసరిగా ఖాతాకు మొబైల్‌ నంబరును నవంబరు 30లోగా అనుసంధానం చేయాలి. ఒకవేళ నంబరును జత చేయకపోతే డిసెంబరు 1 నుంచి ఆయా ఖాతాదారులకు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేయనున్నాం' అని బ్యాంకు వెల్లడించింది. అన్‌లైన్‌ ద్వారా ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.

Don't Miss